జీవ వైవిధ్యం తో నే ఆహార భద్రత

జి. వి. రామాంజనేయులు, వీణ రావు

మానవ మనుగడ అంతా కూడా ప్రకృతి లోని జీవరాసులని సమర్ధవంతంగా, సుస్థిరంగా వాడుకోవటం పై ఆధార పడి వుంటుంది.   అయితే ఎక్కువ భాగం ఈ జీవ వైవిధ్యం అంతా పేద, అభివృద్ధి చెందిన దేశాలలో వుంది.  ప్రకృతి వనరులని విచ్చల విడిగా వాడు కొని పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ భవిష్య వాణిజ్య ప్రయోజనాలకు ఈ జీవ వైవిధ్యం పైన కన్ను వేశాయి.  తమ దగ్గర లేని ఈ జీవ వైవిధ్యాన్ని వాడుకోవటానికి అవకాశం, వాడుకోవటం లో వీటి పై మేధో సంబంధ హక్కులు సంపాదించుకోవటానికి పెద్ద దేశాలు ప్రయత్నించటం తో ఇరవై సంవత్సరాల క్రితం –ఈ పరస్పర వ్యతిరేక ఆలోచనలను, ఒక తాటి పైకి తెచ్చి సుస్థిర అభివృద్ధి సాధించటానికి ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యం లో  ‘జీవ వైవిధ్య సదస్సు’ ప్రారంభమైంది.

భారత దేశం లో జీవ వైవిధ్యం

ప్రపంచం లో ఇప్పుడు సాగులోవున్న పంటలన్నీ పుట్టినవి  (centre of origin) ఎనిమిది ప్రాంతాలలో అని శాస్త్రవేత్తలు చెపుతారు, అందులో భరత దేశం ఒకటి.  మన దేశం లో సుమారు 375 పంటలలో, 140 కి పైగా పశువులలో  (domesticated)    వివిధ్యం వుంది.  ప్రపంచ భూవిస్తీర్ణం లో భారత్  కేవలం 2.4%  మాత్రమే, అయినా జనాభా 18%.  ఇంతటి జనాభా వున్నా, మానవాళికి తెలిసిన 45,000 రకాల మొక్కలు, 91,000 రకాల పశువులు మన దేశం లో వున్నాయి. అయితే, ఇంతటి వైవిధ్యానికి పుట్టునిల్లు అయిన దేశం లో  మనం ఈ జీవ వివిధ్యాన్ని త్వరిత గతిన కోల్పోతున్నాం.  అందుకు ఈ జనాభా పెరుగుదల, అభివృద్ధి అవసరాలు కారణం అని ప్రభుత్వం చెపుతున్నా, విశ్లేషణలు అన్ని కూడా ప్రభుత్వం ఎంచుకున్న టప్పుడు విధానాలే కారణం అని తెలియ చేస్తున్నాయి.  ఆధునిక వ్యవసాయం పేరుతో జరిగిన/జరుగుతున్నా విధ్వంసం కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణాలు కావొచ్చు, గనుల తవ్వకాలకు కావచ్చు లేక పారిశ్రామికీకరణ పేరుతోనో, పట్టణీకరణ పేరుతోనో కావొచ్చు ప్రభుత్వ ఆధ్వర్యం లోనే ఈ విద్వంశం కోనసాకు తూనే వుంది.  ఇలాంటి విధ్వంసకర మైన అభివృద్ధి వ్యతిరేకం గా చాల ప్రాంతాలలో ప్రజలు తిరగ బడుబడుతూనే వున్నారు.  స్థానిక జీవ వైవిధ్యం పైనే ఆధార పడిన తమ జీవనో పాదులకు ఇలాంటి అభివృద్ధి ముప్పు అని గుర్తింఛి  పోరాటం చేస్తున్నారు.

 use centres fo origin photo

(1)    Mexico-Guatemala, (2) Peru-Ecuador-Bolivia, (2A) Southern Chile, (2B) Southern Brazil, (3) Mediterranean, (4) Middle East, (5) Ethiopia, (6) Central Asia, (7) Indo-Burma, (7A) Siam-Malaya-Java, (8) China

 వ్యవసాయ రంగం జీవ వైవిధ్యం

జీవ వైవిధ్యాన్ని ఆహార, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వ్యవసాయ రంగం లోనే ఎక్కువ వాడుకుంటాం.  జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లటం తో వ్యవసాయ రంగానికి పెద్ద ముప్పు, తద్వారా మన ఆహార భద్రత కు పెనుముప్పు ఏర్పడే అవకాసం వుంది. 

 మన దేశ వ్యవసాయం లో ఒకప్పటి జీవి వైవిధ్యం

 

పంట/జాతి రకాల సంఖ్య
 వరి 100,000 Varieties  
 మామిడి 1000 Varieties  
 జొన్న 5000 Varieties
వంగ 3500 varieties  
 ఆవులు 27 Breeds  
 మేకలు 22 Varieties  
 గొర్రెలు 40 Breeds  
 కోళ్ళు 18 Breeds  
 గేదెలు 8 Breeds  

  

 

ప్రపంచంలో సహజం గా వుండే మొక్కలో కొన్ని మొక్కలను తన అవసరాలకు వాడుకోవచ్చొని మానవుడు గుర్తించటం తో వ్యవసాయం, తద్వారా స్థిర జీవనం, గ్రామాల అభివృద్ధి ప్రారంభం అయ్యాయి.  మన దేశం లో వున్న వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, వివిధ అవసరాల కోసం అనువైన వంగాడాలు, వ్యవసాయ పద్ధతులు కలక్రమేని అభివృద్ధి చెందాయి.    మన అవసరాలకు వాడుకుంటున్న పంటలన్నిటిని మూడు వేల సంవత్సరాల క్రితమే సాగులో తెచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కొత్త పంటని కూడా మనవ జాతి కనుక్కోలేక పోయింది. 

 

అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మనం ఎంచుకున్న విధానాలు ఈ వైవిధ్యాన్ని నాసనం చేస్తున్నాయి.  మనకు స్వాతంత్ర్యం వచ్చేసరికి మన ఆహార అవసరాలకు అనేక పంటలు వున్నా, కేవలం కొన్ని పంటల పై ద్రుష్టి పెట్టటం వాళ్ళ మిగిలినవి కనుమరుగై పోయాయి.  ఆహార ధాన్యాలు అంటే ఈ రోజు మనకు తెలిసినది కేవలం వరి, గోధుమ మాత్రమే, వీటి కంటే ఆరోగ్య కరమైన అనేక ఇతర చిరుధాన్యాలు ఈ రోజు సాగులో లేవు.  వరి, గోధుమ సాగు పెరగటం వలన నీటి వినియోగం పెటిగింది.  ఒక కిలో వరి బియ్యం పండటానికి  దాదాపు 5000 లీటర్ల నీరు అవసరం, అదే జొన్న, సజ్జ లాంటి చిరుధాన్యాల కైతే కేవలం 200 లీటర్ల నీరు సరిపోతుంది.  ఇలా పంటల సరళి లో మార్పు రావటం వలన నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు తరగి పోయాయి.  అలాగే పెద్ద విస్తీర్ణం లో ఒకే పంట వేయటం వలన పురుగులు తెగుళ్ళ సమస్యలు, ఒకే పంటను మరల మరలా అదే భూమి లో సగుచేయటం వలన భూసారం కోల్పోవటం జరిగుతూంది. దీని వలన పురుగు మందుల వినియోగం, రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతోంది. అలాగే మన రాష్ట్రము లోని ఒంగోలు జాతి ఆవులు కాని, పుంగనూరు ఆవులు కాని, దక్కని గొర్రెలు కాని, అసిల్ కోళ్ళు కాని అన్ని మన ప్రాంతాలకి అనువైనవి. వాటిని ప్రోత్సహించకుండా, కేవలం బయట దేశాల నుంచి తెచ్చిన వాటినే ప్రోత్సహించటం జరుగుతోంది.  

ఎక్కడ తప్పు చేసాం?

చారిత్రకంగా చూస్తే, చాలా రకాల పంటలు మన దేశం లోనే వుద్భావించటం తో పాటు, స్థానిక వనరుల ఆధారంగా, వివిధ అవసరాలకోసం సాగు పద్ధతులు , పంట రకాలు వున్నట్టు తెలుస్తోంది. అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మన అమెరికా దేశ వ్యవసాయన్ని అనుకరించే ప్రయత్నం చేయటం తో కస్టాలు మొదలయ్యాయి.

వరి మనకి ముక్య మైన ఆహార పంట 1700 ల ప్రాంతాలలోనే తమిళ నాడు లోని చెంగల్పట్టు జిల్లాలో వరి దిగుబడులు హెక్టారు కి 9 టన్నులు వున్నట్టు తెలుస్తుంది. అయితే మెత్త ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో సాగు పద్ధతులు, రకాలు వేరుగా వుండేవి వాటికి అనుగుణం గానే దిగుబడులు వుండేవి.  స్వతంత్రం నాటికి మన 50,000 రకాల వరి సాగు లో వుండేవి.అందులో సుమారు 55%  మెత్త వరి రకాలు. హరిత విప్లవం పేరుతో మనం వీటి నన్నిటిని నాసనం చేసి నీటి ముంపుతోటే పండించే కొన్ని అధిక దిగుబడి రకాలను ప్రోత్సహించాం.  దీని వలన ఈ వైవిధ్యం అంతా కోల్పోయి ఈ రోజు మన దేశం లో దాదాపు 85% వరి కేవలం 10 రకాల నుంచి మాత్రమే వస్తుంది అంటే ఆక్చర్య పడాల్సిందే.  వరదలను తట్టుకునే రకాలు, కరువుని తట్టుకునే రకాలు, ఉప్పు నీటి ని తట్టుకునే రకాలు అనేకం వుండేవి. అలాగే ఎక్కువ విటమినులు, పోషకాలు వున్న రకాలు కూడా సాగులో వుండేవి. అయితే ఇప్పుడు అవే లక్షణాలను జన్యు మార్పిడి ద్వార ప్రవేశ పెట్ట టానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వుండే వరి రకాలు

 

రకాలు ఇనుము (Fe) (mg/kg) జింకు (Zn) (mg/kg)
స్థానిక రకాలు
కేలాస్ 13.8 35.5
నోయిచి 8.0 46.0
పరమై-సాల్ 15.0 42.5
కబిరాజ్-సాల్ 9.5 36.8
కలాభాత్ 39.3 26.8
అభివృద్ధి చేసిన రకాలు
IET 7029 1.9 31.4
MS13 7.0 34

అలాగే మనకి పోషకాలు కావాలంటే ఆహారం లో వైవిధ్యం వుండాలి కాని ఒక్క వారిలోనే అన్ని పోషకాలు వుండేలా చేయాలి అనుకోవటం మూర్ఖత్వం.  ప్రభుత్వ పరిశోదనలు, సబ్సిడీలు, మద్దతు ధరలు అన్ని వారికీ మాత్రమే సహకారం అందిస్తూ వుండటం తో  తృణ ధాన్యాల సాగు క్రమేపి తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా కనుమరుగవుతోంది.  పోషకాల పరం గా చూస్తే వీటి వరి ఈ మాత్రం సాటి రాదు. పైగా నీటి వినియోగం కూడా తక్కువ.

 

తృణ ధాన్యాలు ఐరన్ Fe content (mg/100 g)
సజ్జ 16.9
సామలు 15.2
కొర్ర 9.3
రాగి 2.8
MS13 వరి రకం 3.0

పోషకాలు ఎక్కువుందే పంటలను ప్రోత్సహించ కుండా ఇప్పుడు ‘గోల్డెన్ వరి’ పేరుతో జన్యు మార్పిడి వరి తేవటానికి  ప్రయత్నం జరుగుతోంది.  వరి లో విటమిన్ బి తయారికి అవసరమైన బీటా కేరాటిన్ వుత్పత్తి అయ్యేలా, అలాగే ఎక్కువ ఐరన్ వుండేలా  జన్యుమార్పిడి పంటలు తయారు చేస్తున్నారు.

బీటా కేరాటిన్ ఎక్కువగా వుండే ఆహారం

 

పంటలు తినటానికి అనువైన భాగం Β-Carotene (µg/100 g)
ఆవాలు ఆకులు/పూలు 16000
తోటకూర ఆకులు 10900
మునగ ఆకు 7500
గోల్డెన్ వరి గింజలు 160

కొన్ని పంటలను, వాటిల్లో కేవలం కొన్ని రకాలు, కొన్ని రకాల  పండించే పద్దతులను మాత్రమే ప్రోత్సహించటం తోనే సమస్యలు అని గుర్తుంచాలి.

అలాగే యంత్రికీకరణ కు అనుగుణంగా పంట రకాలు, వ్యసాయ పద్ధతులు మార్చుకోవటం ఇంకో పెద్ద సమస్య.  దీనికి పత్తి ని వుదాహరణ గా చెప్పుకోవచ్చు.  ప్రపంచం అంతా ఆకులూ, చర్మాలు కట్టుకునే రోజుల్లో, మన దేశం లో పత్తి సాగులో వుండేది.  ప్రపంచ దేశాలన్నితిలోను మొహంజదారో నాటి నుంచి మన దేశం బట్టలకు ప్రసిద్ది. అయితే పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన స్పిన్నింగ్ మిల్లులకు, బ్రిటిష్ రాజ్యం లో అక్కడి మాంచెస్టర్ కు పత్తి ఎగుమతి చేయటం కోసం అమెరికన్ పొడుగు పింజ పత్తి ప్రవేశ పెట్టటం జరిగింది.  దేశీయ పత్తి మెత్త ప్రాంతాలలో పండేది, పురుగు-తెగుళ్ళ సమస్య తక్కువ అయితే, ఈ అమెరికన్ పత్తులు ఎక్కువ నీటి వినియోగం చేసేవి, పైగా పురుగుల-తెగుళ్ళ సమస్యలు ఎక్కువ.  ఈ అమెరికన్ పత్తులతో ఈ రోజు వ్యవసాయ రంగం లో పెద్ద ఎత్తున నాసనం చేస్తున్న ‘పచ్చపురుగు’ (దీనిని అమెరికన బొల్ వార్మ్ అనే అంటారు) వచ్చింది.  వాటిని నియంత్రించటానికి రసాయనిక పురుగు మందులు, వాటికి తట్టుకునే శక్తి పెంచుకుంటే ఇంకా విషపూరిత మైన పురుగు మందులు, ఇప్పుడు జన్యు మార్పిడి పత్తి ఇలా సమస్య కి టప్పుడు పరిష్కారాలు వెతుకుంటూనే వున్నాం.  నిజానికి దేశీయ పత్త్తి రకాలని అభివృద్ధి చేసి, దానికి అనుకూలంగా స్పిన్నింగ్ యూనిట్లు తాయారు చేసి వుంటే, సమస్య చాలా మాటకు తక్కువ వుండేది.

అలాగే పురుగు మందుల వాడకం పెంచుకుంటూ పోవటం, జన్యు మార్పిడి పంటలను అభివ్రిద్ది చేయటం లాంటివి కాకుండా స్థానిక వనరుల తో చేసే సుస్తిర వయస్య పద్ధతులను ప్రోత్సహిస్తే ఖర్చులు తగ్గటం తో పాటు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుకున్న వరం అవుతాము.

వ్యవసాయ వైవిధ్యం –ప్రాంతీయ భేదాలు

చాలా సార్లు మనం గుర్తించని ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే, కొన్ని పంటల్ని కొని రకాల పద్దతులని ప్రోత్సహించటం వలన అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతోంది. ఉదాహరణకి తీసుకుంటే వరి, గోధుమ లకు మాత్రమే ప్రభుత్వ ప్రోత్సాహకాలు వుండటం వలన అవి పండించే ప్రాంతాలలోనే అభివృద్ధి జరిగింది.  మెట్ట పంటలు పండే ప్రాంతలో కూడా రైతులు వాటిని మానేసి వరి, పత్తి  లాంటి పంటలకి మల్లటం వలన ఎక్కువ గా బోరు భావులు వేసుకోవటం, భూగర్భ  జలాలు అడుగంటి పోవటం అప్పుల పాలు కావటం చూస్తున్నాం.  దీని వలన దేశం లో దాదాపు 60%  వున్న మెట్ట ప్రాంతాలు అన్ని కూడా పేదరికం తో మగ్గుతున్నాయి. అప్పులు ఎక్కువ కావటం తో ఆత్మ హత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.  ఈ పరిణామం మన మన రాష్ట్రము లోని తెలంగాణా ప్రాంతం లోను, రాయల సీమ ప్రాంతం లోను , మహారాష్ట్ర లోని విదర్భ ప్రాంతం లోను, కర్ణాటక లో బీదర్ ప్రాంతం లోను, రాజస్తాన్ లోను, మధ్య ప్రదేశ్ లోను చూడొచ్చు. 

జీవ భద్రతే ముక్యం

జీవ వైవిధ్య సదస్సు లో జన్యు మార్పిడి పంటలతో ‘జీవ భద్రతకు’ ముప్పు వుంది కాబట్టి సభ్య దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్నది  ప్రధాన చర్చనీయాంశం గా మొదటి ఇదు రోజులలో వచ్చింది. బిటి పత్తి తో మన దేశ అనుభవాలు కాని, జన్యు మార్పిడి  మొక్క జొన్న తో విదేశీ అనుభవాలు కాని అన్ని చర్చించిన తర్వాత జన్యు మార్పిడి పంటల పై నిర్ణయాలు కేవలం సాంకేతిక అంశాల ఆధారం గా మాత్రమే కాకుండా… సామజిక, ఆర్ధిక అంశాలు కూడా ద్రుష్టి లో పెట్టుకోవాలని, అలాగే జీవ భద్రత కు ముప్పు వాటిల్లితే వీటిని అబివృద్ది చేసిన వాళ్ళకి జవాబుదారితనం వుండాలని, భాధితులకి (ప్రాంతాలు, దేశాలు) నష్ట పరిహారం చెల్లించే వ్యవస్థ వుండాలని ఒప్పందంలో వున్నది కాబట్టి దీని ఆధారం గా మన ప్రభుత్వ్యం జీవ భద్రత చట్టం తేవాలి. ఇప్పుడున్న BRAI బిల్లును రద్దు చేయాలి.

అలాగే, ఈ సదస్సు రెండవ భాగం అంతా జీవ వైవిధ్యాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకుంటే (access)..అప్పటిదాకా వాటిని కాపాడుతున్న వాళ్ళకి లాభాలు ఎలా పంచాలి (benefit sharing) అన్న వాటిపై కూడా చర్చ జరగ బోతుంది.  ఈ నేపధ్యం జీవ వైవిధ్య కమిటీ లను బలోపేతం చేయాల్సిన అవసరం వుంది. లేకుంటే చివరకి జీవ వైవిధ్యాన్ని కంపెనీ లకు ఉపయోగ పడతాయి కాని ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడవు.

ఆహార భద్రత కు ఇలాంటి పద్ధతులే మార్గమా?

ఆధునిక వ్యవసాయం తో వచ్చే సమస్య ల గురించి మాట్లాడినప్పుడల్లా ఆహార భద్రతకు ఇదే దారి అని వాదన లు వినిపిస్తున్నాయి. ఈ రోజు దేశం లో చూస్తే సుమారు 25 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. మన దేశ జనాభా 130 కోట్లు, అందరూ మూడు పూటలా భోజనం చేస్తారు  అనుకున్నా  మనకు కావలిసింది 9.5 కోట్ల తన్నులు మాత్రమే (ప్రతి వ్యక్తికీ రోజుకు 200 గ్రా. లెక్క తీసుకుంటే). అంటే ఇప్పుడు వస్తున్నా వుత్పత్తి మన అవసరాలకంటే రెండింతలు వుంది.  అయినా దేశం లో ఆకలి, పేదరికం వున్నాయి. ప్రజలకి,  ముక్యం గా వ్యవాసం మీద ఆధార పడి జీవిస్తున్న గ్రామీణ ప్రజలకి ఆదాయ భద్రత కల్పిచాకుండా ఆహార భద్రత అసంభవం.  అలాగే ఆహార భద్రత అంటే కేవలం వరి గోధుమ కాదు, తిండి గింజలు మాత్రమే కాదు.  పోషక ఆహార భద్రత కావలి, పర్యావరణ భద్రత కావాలి అప్పుడే దేశానికి ఆహార భద్రత…అది కొత్త టే టెక్నాలజీ లలో లేదు…. వైవిధ్యాన్ని , పర్యావరణాన్ని, చిన్న సన్నకారు రైతుల, రైతు కూలీల జీవనోపాదులు కాపాడుకోవం లో నుండి….ప్రకృతి వనరులను కాపాడుకోవటం లో వుంది.