భారత దేశం లో మొదటి సేంద్రియ రాష్ట్రం గా సిక్కిం ఖ్యాతి గడించింది. తమ ప్రకృతి వనరులను కాపాడుకోవటానికి, గ్రామాలలో నివసించే 80% ప్రజల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం 2003 లో అధికారికం గా పూర్తి సేంద్రియ రాష్ట్రం గా మారటానికి నిర్ణయం తీసుకున్నది. సిక్కిం రాష్ట్ర పూర్తి విస్తీర్ణం 7,29,900 హెక్టార్లు మాత్రమే. అందులో వ్యవసాయం నడిచేది కేవలం 10.20 % విస్తీర్ణం (74,303 హెక్టార్లు) లోనే. మొత్తం రైతులు 64,088 మంది. ప్రధాన పంటలు మొక్కజొన్న, వారి, గోధుమ, మినుములు, సోయా, ఆవాలు, ఆరంజ్, పియర్, అల్లం, పసుపు, యాలుకలు, చెర్రీ పెప్పర్, బటాని మరియు కూరగాయలలో టమాటో, బంగాళదుంప, కాలిఫ్లవర్, కాబేజీ, పూలల్లో గులాబీలు, గేర్బెర, అంతురియం ముఖ్యమైనవి. అలాగే బంగాళాదుంప, కాలిఫ్లవర్, కాబేజీ, బటాని ల విత్తనోత్పత్తి కి అనుకూలమైన వాతావరణం.
దీనికి అవసరమైన విధివిధానాలను రూపొందిస్తూ 2004 లో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని రూపొందించారు. వ్యవసాయం, పశు వనరులు పూర్తిగా సేంద్రియం గా మారటానికి కావాల్సిన చర్యలు చేపట్టటం జరిగింది. దీనిలో భాగంగా రసాయనిక పురుగు మందులు, ఎరువులు, గ్రోత్ హోర్మోన్స్, యాంటిబయాటిక్ ల వాడకం, అమ్మకం లపై నిషేధం విదించటం జరిగింది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ కలిసి సేంద్రియ వ్యవసాయం వైపు పయనించేలా చర్యలు చేపట్టారు. అన్ని కేంద్ర పధకాలతో సహా అన్ని ప్రభుత్వ పధకాలను సేంద్రియ వ్యవసాయం వైపు మార్చటం జరిగింది. క్రమేపి మార్పు తేవటానికి తీసుకున్న చర్యలు
- ప్రతి సంవత్సరం రసాయనిక ఎరువులు, పురుగుమందుల పై ఇచ్చే సబ్సిడీ లను పది శాతం తగ్గిస్తూ పూర్తిగా మానివేయటం
- రాష్ట్ర వాటా క్రింద కేంద్ర ప్రభుత్వం అందించే రసాయనిక ఎరువులు, పురుగు మందులను తీసుకోక పోవటం
- రసాయనిక ఎరువులు, పురుగు మందులు అమ్మే దుఖానాలన్నిటిని మూసివేయటం
- SIMFED (సిక్కిం రాష్ట్ర సరఫరాల మరియు సహకార మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా జరిగే రసాయనిక ఎరువుల అమ్మకాలు మానివేయటం
- కొత్త లైసెన్స్ లు ఇవ్వకుండా వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు ఆదేశాలు
- బయటి రాష్ట్రాల నుంచి రసాయనిక ఎరువులు, పురుగు మందులు తీసుకు రాకుండా చర్యలు తీసుకోవటానికి రవాణా శాఖకు ఆదేశాలు
- సేంద్రియ ఎరువులను కొని రైతులకు అందుబాటు లో వుంచటం
- రైతులు సొంతం గా పొలం లో సేంద్రియ ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకోవటానికి సబ్సిడీ లు
- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో విత్తనాలు, బయో ఉత్పత్తులు, సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి కావాల్సిన ఏర్పాట్లు
- రైతులకు, యువతకు సేంద్రియ వ్యవసాయం, ఉత్పాదకాల తయారీ నేర్పటం కోసం సేంద్రియ జీవనో పాదుల పాటశాలలు నడపటం
సేంద్రియ రాష్ట్రం గా మారటానికి నిర్ణయం తీసుకున్న తర్వాత మొదట 100 గ్రామాలను గుర్తించి జీవ గ్రామాలు (బయో విలేజ్) గా మార్చటం ప్రారంబించారు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వ అధీనం లో నజితం, మెల్లిధార వ్యవసాయ క్షేత్రాలను ‘సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్’ గా గుర్తించి పరిశోధనలు, క్షేత్ర పరీక్షలు, శిక్షణ కోసం నమూనా క్షేత్రాలను నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయాన్ని అమలు చేసేందుకు, సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించటం కోసం 2010 లో సిక్కిం ఆర్గానిక్ ఫార్మింగ్ మిషన్ ఏర్పాటు చేయటం జరిగింది. దీని ఆధ్వర్యం లో ప్రతి సంవత్సరం ఇరవై వేల ఎకరాలు సేంద్రియ వ్యవసాయం కిందకు తెచ్చేందుకు, 2015 నాటికి రాష్ట్రం లో లోని రైతుల భూము లన్నిటిని ఆర్గానిక్ సర్టిఫికేషన్ కిందకు తెచ్చి పూర్తి సేంద్రియ రాష్ట్రం గా మారటానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు.
గత పది సంవత్సరాల అనుభవాలు:
- దిగుబడులు ఇంతకు ముందుకు వలననే వున్నాయి
- ఖర్చులు భాగా తగ్గాయి
- చీడ పీడా పురుగుల సమస్యలు తగ్గాయి
Recent Comments