‘పోలి హౌస్’ వ్యవసాయం తో రైతులకు కష్టాలు

‘హరిత పందిర్లు’ పేరుతో తెలంగాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలి హౌస్ లకు  ప్రోత్సహకాలు ఇస్తున్నది.  అలాగే అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా వీటికి పెద్ద ఎత్తున సహాయం ఇస్తున్నది.  మన వాతావరణ పరిస్థితులు, రైతుల స్థితి గతులు వీటికి అనుకూలంగా లేకున్నా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం వీటిని ఎందుకు ప్రోత్షహిస్తుంది అన్నద్ది ప్రశ్నార్ధకమే.

ప్రభుత్వ లెక్కల ప్రకారం గత పది సంవత్సరాల కలం లో 130 పోలి హౌస్ లకు సబ్సిడీ ఇస్తే…తెలంగాణా ప్రభుత్వం గత సంవత్సరం 250 కోట్లు కేటాయించారు. ఇప్పటికి 129 నిర్మించామని ఉద్యానవన శాఖ చెపుతోంది.

IMG_20150918_100953_HDR

విదేశాలలో ఎక్కువ భాగం చలి నుంచి తట్టుకోవటం కోసం ఇలాంటి వాటిని వాడతారు.  మన దేశం లో ఇలాంటి పరిస్థితులు కేవలం హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్, సిక్కిం లాంటి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే వున్నాయి.  ముఖ్యం తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు వీటి కి ఏమాత్రం అనుకూలం కాదు.

‘పోలి హౌస్’ వ్యవసాయం తో ప్రధాన సమస్యలు

  • మన లాంటి వేడి (ఉష్ణ) ప్రాంతాల్లో పోలి హౌస్ లో వేడి విపరీతం గా పెరుగుతుంది. ఇది తగ్గించటం కోసం లోపల ఫ్యాన్ లు , నీటి చల్లటానికి మిస్ట్ బ్లోయర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. వీటివలన ఖర్చు, విద్యుత్తు పై ఆధార పడటం బాగా పెరుగుతుంది.
  • ఫ్యాన్లు, మిస్ట్ బ్లోయర్స్ లేకుండా మామూలుగా గాలి ఆడేలా వుండాలి అంటే పోలి హౌస్ నిర్మాణం చాలా ఎత్తు గా చేయాల్సి వస్తుంది.  దీనితో మరలా ఖర్చు భాగా పెరుగుతుంది.
  • వేడి వలన పుప్పొడి దెబ్బతిని కాయలు తాయారు కావు. అలాగే చాలా కూరగాయలు ఫలదీకరణ కోసం తేనెటీగలు మొదలైన పురుగుల పైన ఆధార పడతాయి. పోలి హౌస్ ల లోకి వాటి ప్రవేశం తక్కువ కాబట్టి కూడా దిగుబడులు తగ్గుతాయి.
  • వేడి తగ్గించటం కోసం ఎక్కువ నీరు చల్లితే (మిస్ట్) తెగుళ్ళు ఎక్కువగా పెరుగుతాయి.
  • అలాగే పోలి హౌస్ లోపల కర్బన వాయువులు పెరిగి, ఆక్సిజన్ తగ్గిపోతుంది, దానితో తెగుల్ల సమస్యలు, దిగుబడులు తగ్గటం జరుగుతుంది.
  • బయట నుంచి పురుగులు ఒక్కసారి ప్రవేశిస్తే, లోపల బదనికలు లేక పోవటం వళ్ళ లోపల వాటి సంఖ్యా విపరీతం గా పెరిగి పోతుంది.
  • నిర్వహణ ఖర్చులు బాగా ఎక్కువ కావటం తో ఇక్కడ సాధారణం గా పండే పంటలు కాకుండా విదేశాలకు లేక దూర ప్రాంతాలకు ఎగుమతి చేసే పంటల పై ఆధార పడాల్సి వస్తుంది. వాటితో ఉత్తత్తి లోను, మార్కెటింగ్ లోను సమస్యలు ఎక్కువ అవుతాయి.

 IMG_20150918_101033_HDR IMG_20150918_174514_HDR

 ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మించిన పోలి హౌస్ లలో మూడు వంతులు పనిచేయటం లేదు. కేవలం ఎగుమతులకోసం ‘గేర్బెర’ లాంటి పూలు పండించుకునే రైతులు మాత్రమే వీటిని ఇంకా వాడుతున్నారు. మిగితా వాళ్ళంతా కవర్ తీసేసి పైప్ లను తీగ జాతి మొక్కలు పాక టానికి వాడుకుంటున్నారు.

పోలి హౌస్ లకు సబ్సిడీ లు

ప్రస్తుతం వీటి నిర్మాణానికి సుమారు గా ఎకరానికి ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇరువై ఐదు లక్షల వరకు (70%) సబ్సిడీ ఇస్తుంది. మిగితా పది లక్షలు రైతు భరించాలి. హైదరాబాద్ చుట్టూ వంద కిలోమీటర్ల పరిదిలో 1000 ఎకరాల్లో పోలి హౌస్ ల నిర్మాణం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక రైతు కనీసం 200 చ.మీ. నుంచి మూడు ఎకరాల వరకు సబ్సిడీ పొందవచ్చు.

అయితే తమ వంతు వాటా గా పది లక్షలు కట్టగలిగే స్థితి లో ఏ సాధారణ రైతు లేరు.  దానితో పట్టణాలలో వున్న వారు పెట్టుబడుల కోసం ఇలాంటివి పెట్టుకుంటున్నారు. ఇంత ఎక్కువ  ఇలా కొంత మందికి మాత్రమే చాలా పెద్ద మొత్తం లో (మూడు ఎకరాలలలో పోలి హౌస్ వేసుకున్న వారికి గరిష్టం గా 75 లక్షలు) సబ్సిడీ ఇవ్వటం వలన, కొంచెం సహాయం కోసం ఎదురు చూస్తున్న చాలా మంది రైతులు బాగా నష్ట పోతారు.

అలాగే కేవలం ఎగుమతుల కోసం అంటూ పండించే పంటలకి పెద్ద ఎత్తున ప్రోత్సహకాలు ఇవ్వటం కూడా అనవసరం. ఇక్కడ పండించుకొని ఎక్కువ భాగం ఇక్కడ వాడుకునే పంటలకు, చిన్న సన్న కారు రైతులకి ఉపయోగ పడే పద్ధతులని ప్రోత్శాహించాలి.

సాధారణ ఆకుకూరలు, కాయగూరలు పండటానికి 28-32 డిగ్రీ ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు  అనుకూలం కాదు. ఇందుకోసం రైతులు మామూలు షేడ్ నెట్స్ వాడుకోవటం చేయవచ్చు, అలాగే పొలం గట్ల పై చెట్లు పెంచు కోవచ్చు.   పోలి హౌస్ లాంటివి అనవసరం. వీటి మీద పెట్టె ఖర్చు, సబ్సిడీ లు ప్రభుత్వం వేరే వాటికీ మళ్లిస్తే మంచిది.