:::: MENU ::::

Posts Categorized / తెలుగు

  • Feb 06 / 2015
  • 0
Articles, తెలుగు

వ్యవసాయం లో జీవావరణ పద్దతులు:  సేంద్రియ వ్యవసాయం

వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ది కి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం.   అన్ని రంగాలలో వున్నట్టే ఈ రంగంలోనూ అభివృద్ధి గురించి భిన్నమైన దృక్పధాలు, విభిన్నమైన ఆలోచనలు వున్నాయి.  ఈ భిన్న­భిన్న దృక్పధాలను ఆలోచనలనూ ప్రతిభింబిస్తూ అనేక వాదనలు, ప్రతివాదనలు పుట్టుకువస్తున్నాయి.  ఇవన్నీ కలిసి సామాన్య రైతును మరింత అయోమయానికి గురి చేస్తున్నాయి.  ఈ పరిస్థితులలో ఏలాంటి వ్యవసాయ పద్ధతులు అవలంభించాలి, తమ పంట పొలాలను, తమ జీవితాలను, పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇలాంటి విషయాలపై నిర్ణయాలు తీసుకునేముందు వేటికి ప్రాముఖ్యత ఇవ్వాలి, అలాగే వివిధ విధానాలు, పద్ధతుల మధ్యలో తేడాలు, అలాగే ప్రచారం లో వున్నా కొన్ని అపోహలు లాంటి విషయాలపై స్పష్టమైన అవగాహన కలిగించటం ఈ వ్యాసం ముఖ్య వుద్దేశం.

ఆధునిక వ్యవసాయం: ఆధునిక పద్ధతులన్నీ ఏ స్థాయి రైతుకైనా, ఏ ప్రాంత రైతులకైనా, ఏ పరిస్థితులకైనా ఒక్కలాగానే పని చేస్తాయనే భావన అధునిక వ్యవసాయం ప్రధాన లక్షణం.  అలాగే ఆధునిక వ్యవసాయం మనం పండించే పంటకు మిగితా జీవాలన్నిటిని పోటీగా భావిస్తుంది.  దాంతో వేరే మొక్కలని (చివరికి అదే పంటకు చెందిన వేరే రకాలైనా) కలుపుగా భావిస్తుంది.  ఒకే పంట ను అధిక విస్తీర్ణం లో, పంటలో కూడా ఒకే రకాన్ని ఎక్కువ విస్తీర్ణం లో పండిచటం వలన జీవ వైవిధ్యం దెబ్బ తినటంతో పాటు పురుగులు తెగుల్ల సమస్య పెరుగుతుంది. పంట మీద వుండే పురుగులన్నిటినీ శత్రువులుగా చూడటం వలన వాటిని చంపే ప్రయత్నంలో వాడే రసాయనాలు కలుపును, పురుగులనే కాక అనేక ఉపయోగపడే మొక్కలను, కీటకాలను ఇతర జీవాలను అంతం చేస్తున్నాయి.  ఒకప్పుడు పిట్టల కిలకిలారావాలతో కలకల లాడే ఊర్లు ఇప్పుడు నిశబ్ధమైపోయాయి. కందిరీగలు, తేనెటీగలు, కన్పించటం లేదు.  ఇవి పోతే పోయాయి కనీసం పంటలు బాగున్నాయా అంటే అదీ లేదు.

ప్రకృతిలో సమతుల్యత దెబ్బతినటంతో చీడపీడల సమస్యలు అధికమయ్యాయి.  ఈ పోటీ అనేక కొత్త రసాయనాలను మార్కెట్టులోకి తెస్తుంది, అవి వచ్చినంత త్వరగానే నిరుపయోగంగా మారిపోతున్నాయి. ఎంచుకునే ఒత్తిడి (సెలెక్షన్‌ ప్రెషర్‌) పెరిగి అవి తొందరగా తట్టుకునే శక్తిని పెంచుకుంటున్నాయి.  ఈ రసాయనాలు, ఇంకా రసాయనిక ఎరువుల వాడకంతో నేలలోని సూక్ష్మజీవులు చనిపోయి, సహజంగా ప్రకృతి నుంచి లభించే పోషకాలు మొక్కలకు అందకుండా పోతున్నాయి.  నేలలోని సేంద్రియ పదార్దాలపాలు తగ్గటంతో మట్టిలో తేమను పట్టివుంచే గుణం తగ్గుతోంది.  దీనికి తోడు వర్షాలు సరిగ్గా పడక పోవటం, భూగర్భ జలాలు అడుగంటి పోవటం వంటి సమస్యలతో పాటు, ఈ రసాయనాల అవశేషాలు మట్టి భౌతిక, రసాయనిక లక్షనాలను కూడా పాడు చేసి పొలాలను బీడుగా మారుస్తున్నాయి.  ­dటన్నిటికి తోడు ఈ రసాయనాల కొనుగోళ్ళతో ఖర్చు అధికంగా పెరిగి రైతులకు అప్పుల భారం ఒక వైపు తోడై, సరైన గిట్టుబాటు ధర లభించక నష్టాల భారం ఇంకొక వైపు తోడై, ఆవేశంలో దాడులు చేయటం లేకపోతే నిరాశలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి.

విదేశాలలో ఇలాంటి వ్యవసాయం బాగా జరుగుతింది కదా! అలాంటివ్యవసాయ పద్ధతులను అవలంబిస్తేనే  దేశ ఆహార భధ్రత కల్పించగాలుగుతమని ప్రభుత్వ, శాస్త్ర వేత్తల వాదన.  అయితే అది మనకు ఎంత ఉపయోగం? మన పరిస్థితులకి ఎంత అనుగుణం అని అర్థం చేసుకోవాలంటే…అమెరికా వ్యవసాయ రంగ పరిస్థితిని మనం సమీక్షించుకోవాలి.  మనకు లాభసాటి అని చెప్పబడుతున్న అమెరికా వ్యవసాయం…పూర్తిగా ప్రభుత్వ సబ్సిడితో నడుస్తుంది.  ఎకరానికి సుమారుగా రెండు లక్షల రూపాయల sసబ్సిడీ అందుతుంది.  మన దగ్గర మహా అయితే ఐదు వేల రూపాయలు అదీ ఎరువుల సబ్సిడి రూపం లో…రసాయనిక ఎరువులు వాడని వారికి అది కూడా దొరకదు.  ఖర్చుల విషయం చెప్పకుండా కేవలం సాంకేతిక అభివృద్ధి అనీ పేరుతో, దేశ ఆహార భద్రత పేరుతో ఈ పద్ధాలను ప్రోత్సహించటం వలన..వున్న కొద్దిపాటి సబ్సిడీలు ఇటువంటి పద్ధతులకే ఇవ్వటం వలనా రైతులంతా రసాయనిక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.

సాంప్రదాయ వ్యవసాయం: ఆధునిక వ్యవసాయానికి ఎంత ప్రచారం కల్పించినప్పటికి వనరులు సమృద్ధిగా వున్నప్రాంతాలకి, పొలాలకి, రైతులకి పరిమితం అయిపోయింది.  వర్షాధార ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో, చిన్న సన్నకారు రైతులు ఇంకా చాలా మంది పాత పద్ధతులతోనే వ్యవసాయం చేస్తున్నారు.  ఆధునిక వ్యవసాయం ఈ పరిస్థితులకు అనుగుణంగా పద్ధతులను అభివృద్ధి చేయటానికి ఉపయోగపడక, విదేశీ విజ్ఞానం పేరుతో ఇక్కడి జీవావరణానికి, రైతుల ఆర్ధిక, సామజిక పరిస్థితులకు అనుగుణంగా లేని ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశ పెట్టటానికి ప్రయత్నం చేసింది. ఉత్పాదకాల కోసం మార్కెట్‌ మీద ఆధార పడటం ఎక్కువ అవటంతో అధునిక పద్ధతులు అవలంభించిన రైతులు మొదట్లో లాభాలు గడించినా, క్రమేపీ ఎక్కువగానే నష్టపోయారు.  అయితే సాంప్రదాయిక పద్ధతులలో దిగుబడులు తక్కువ వుండటం, సాంప్రదాయక పంటలకు మార్కెట్లో డిమాండ్‌ లేకపోవటంతో రైతుల పరిస్థితులు బాగుపడటం లేదు.  చాలా ప్రాంతాలలో రైతుల పరిస్థితులు బాగుపడటం లేదు.  చాలా ప్రాంతాలలో ఇవి కేవలం అక్కడి స్థానిక ఆహార అవసారాలను కొంత మటుకు తీర్చటానికి పరిమితమైపోయాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులలోని నష్టాలు, పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఆరోగ్యానికి కలుగుతున్న హాని గుర్తెరిగి, రసాయనిక పదార్ధాల స్థానంలో సేంద్రీయ పదార్ధాల వినియోగాన్ని పెంచుకునే దిశలో ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు.  దీనికి తోడు వినియోగదారులలో ఆహార పదార్ధాలలో ఆధునిక రసాయనాల అవశేషాల పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఈ పద్ధతులకు ప్రాముఖ్యత కలిగిస్తోంది.  అయితే, వినియోగదారులలో  వీdటి వైపు పెరుగుతున్న ఆదరణ చూసి, ఈ పద్ధతులను నియంత్రించటానికి పశ్చిమ దేశాల్లో ఇప్పటికే ఆధునిక సూపర్‌ మార్కెట్లు ప్రయత్నాలు ప్రారంభించాయి.  ఏ పద్ధతులు అవలంభించవచ్చు, ఏవి  అవలంభించకూడదు, అన్న వాటిపై ప్రమాణాల పేరుతో నియంత్రణ సాధించటానికి సర్టిఫికేషన్ పేరుతో ప్రయత్నం చేస్తున్నాయి.  అయితే సేంద్రియ పద్ధతులలో వున్న ఉపయోగాలు గుర్తించి, ఈ మార్కెట్‌ ప్రమాణాలనుంచి, రైతులు తమ ప్రమాణాలను నిర్దేశించుకునే దిశగా కొన్ని సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

సహజ వ్యవసాయం: జపాన్‌ కు చెందిన ‘ముసనోబు ఫుకువోకా’ ప్రారంభించిన ఒక ఉద్యమం ఈ సహజ వ్యవసాయం.  ప్రకృతిలోని సహజత్వాన్ని ఎక్కువ మార్పు లేకుండా చేసే పద్ధతులతో చేసే వ్యవసాయం. అయితే ఇది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైపోయింది.

జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం: మహారాష్త్ర కు చెందినా ‘సుభాష్ పాలేకర్’ గారు ప్రారంబించిన ఈ ఉద్యమం ఇప్పుడు దేశ వ్యాప్తం గా ప్రాచుర్యం పొందినది.  మహారాష్ట్ర లో దభోల్కర్ ప్రారంబించిన ఉద్యమం లోనుంచి పుట్టిన అనేక ప్రత్యామ్నాయ పద్ధతులలో ఇది ఒకటి. ఆవు పేడ మూత్రం, వేపాకులు లాంటి స్థానిక వనరులు వాడి  చేసుకునే అనేక రకాల ఉత్పత్తులతో పంటలను పండించు కోవటం ఇందులో ప్రధాన విధానం. వీటితో పాటు నేలను కప్పి ఉంచటానికి ‘అచ్చాధం’ (ముల్చింగ్), చిన్న మడులలో బహుళ పంటల విధానం ఇందులో ముఖ్య మైన అంశాలు.

పెర్మాకల్చర్‌:  ‘పెర్మనెంట్‌-అగ్రికల్చర్‌’ అనే రెండు ఆంగ్ల పదాల కలయికతో ఏర్పడిన పదం.  పొలాన్ని ప్రకృతి సూత్రాలకి అనుగునంగా డిజైన్‌ చేయటం ఇందులోని ప్రత్యేకత.

బయో-డైనమిక్ వ్యవసాయం: స్విట్జర్లాండ్ కు చెందిన రుడోల్ఫ్ స్టినేర్ గ్రహాల గమనాన్ని బట్టి పంటలు వేసుకునే విధానాల్ని, కొన్ని ప్రకియల ద్వారా వ్యవసాయం వాడే నీరు, విత్తనాలలో ‘కాస్మిక్ ఎనర్జీ’ వచ్చేలా చేయటం, పంట వ్యర్దాల్ని, పశు వ్యర్ధల్ని వాడుకొని కంపోస్ట్ చేసి వాడుకోవటానికి కొన్ని కొత్త పద్దతులు కనిపెట్టారు.   

సుస్థిర వ్యవసాయం:  ఆధునిక వ్యవసాయం లోని లోటు పాట్లు, సమస్యలను అధిగమించటానికి, సాంప్రదాయకంగా రైతుల వద్ద వున్న ­జ్ఞానం అందించిన ఆలోచనలను జోడించి, స్తానిక వనరుల మీద, స్థానిక జీవావరణం మీద ఆధారపడి చేసే వ్యవసాయం ఆర్ధికంగా, పర్యవరణ పరంగా వ్యవసాయాన్ని సుస్థిరత్వం చేస్తుంది. సహజ వనరులైన, గాలి, నీరు, మట్టి లని, జీవరాశులకి నష్టం కలుగకుండా,  పొలం స్థాయిలో,పరిస్థితుల కనుగుణంగా  రైతు స్థాయి లో, రైతు బృందాల స్థాయి లో, గ్రామస్థాయిలో…ఈ వనరులను సమీకరించుకోవటం పై కేంద్రీకరించటం ఈ రకమైన విధానాలలో ముఖ్యాంశం.

ప్రస్తుతం మార్కెట్‌ పై ఆధారపడే చాలా వనరులని రైతుల తమ విజ్ఞానం, నైపుణ్యత, శ్రమ, ప్రకృతిలో లభించే వనరులతో, సహజ ప్రక్రియలను పునరిద్ధరించటం ద్వారా వాడుకోవచ్చును.

ఆధునిక వ్యవసాయం లో రైతులు తమ విజ్ఞానం అంతా కోల్పోయి, కేవలం మార్కెట్‌, పత్రికలు, శాస్త్రవేత్తలు అందించే సమాచారంతో మార్కెట్లో దొరికే వస్తువులు కొనుక్కుని వాడుకునే వినియోగదారులుగా మిగిలిపోతున్నారు.  సుస్థిర వ్యవసాయం లో ఈ పద్ధతులకు స్వస్తి చెప్పి, తమ విజ్ఞానాన్ని పెంచుకుని, తమ వనరులపై ఆధారపడి వ్యవసాయం చేసుకునే పరిస్థితులలోకి చేరవచ్చును.

సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూత్రాలు

పంటలు విత్తనాలు:  తమ పొలాలకి, వనరులకి, ఎలాంటి పంటలు,  విత్తనాలు, రకాలు సరిపోతాయి, అన్నది అర్ధం చేసుకొని ఎంపిక.  మార్కెట్‌ పై ఆధారపడకుండా జన్యు వైవిధ్యం పాటిస్తూ తమ విత్తనాలు తామే సేకరించి వాడుకోవటం. ఉదా: పత్తి పంటలో వర్షాధార ప్రాంతాలలో, లోతు తక్కువున్న ప్రాంతాలలో హైబ్రిడులకు బదులు సూటి రకాలు తక్కువ దూరం తో నాటుకొని (ఎకరానికి ఎక్కువ మొక్కలు వచ్చేలా) తక్కువ కాలం లోనే మంచి పంట సాదించు కోవచ్చు

భూమిలో పోషకాలు: సుస్థిర వ్యవసాయం కేవలం పంట మీదనే  కాక మట్టి స్వభావాన్ని పెంచటం పై దృష్టి పెడుతుంది, సేంద్రియ ఎరువుల వాడకం, మట్టిలోని సూక్ష్మజీవుల సహకారం, ఆధునిక కంపోస్టింగు ప్రక్రియల వాడకం చేయవచ్చు.  అన్నీ పద్దతులలోను ముఖ్యమైనది నెలలో సేంద్రియ పదార్థాలను పెంచటం. కనీసం ఎకరానికి రెండు నుంచి నాలుగు టన్నుల వరకు జీవ పదార్థాలను ప్రతి సంవత్సరం నెలకు అందించాలి. దీనికోసం పంట వ్యర్ధాలను, పచ్చి రొట్ట ఎరువులను వాడుకోవచ్చు. అలాగే నేలలో వుంటే పోషకాలు మొక్కలకు అందుబాటులోకి తెచ్చేటందుకు వివిధ సూక్ష్మ జీవుల సహకారం తీసుకుంటుంది.   అయితే పైన చెప్పిన పద్ధతులన్నీ లోను వాడె ఉత్పదకాలన్ని కూడా స్థానికంగా దొరికే మొక్కల భాగాలు వాడుకొని తాయారు చేసే కాషాయాలు, పశువుల పేడ-మూత్రం పులియ పెట్టి తాయారు చేసే ద్రవనాలు వాడుకునేవే.

నీటి యాజమాన్యం: సుస్థిర వ్యవసాయం నేలలో తేమనురక్షించుకోవటానికి ­­ధ పద్ధతులు, నేలలో సేంద్రీయ పదార్ధాల పెంపు, భూమి కప్పించి వుంచే పంటలు, మల్చింగ్‌, పంటల ఎంపిక, ­ధానాలలో మార్పు.

పురుగుల యాజమాన్యం: రసాయనిక పురుగుమందులను పూర్తిగా మానివేయటం, పురుగులు ఎప్పుడు సమస్యగా మారతాయో అర్ధం చేసుకోవటం, పురుగు వివిధ దశలు అర్ధము చేసుకొని,  ఏ దశలో ఎలాంటి చర్యలు  చేపట్టి పురుగులు సమస్యగా మారకుండా వుంచుకోవచ్చో అర్ధం చేసుకుని పాటించటం, నష్టం కలుగ చేసే స్థాయిలోనే నివారణ చర్యలు చేపట్టటం, ప్రకృతి లో వున్న సమతుల్యాన్ని కాపాడుకోవటం వలన పురుగు ఉధృతి ఎక్కువైతే స్థానిక వనరులు ఉపయోగించి నివారణ చర్యలు చేపట్టటం, సహజ ప్రక్రియలను సమర్ధవంతంగా వినియోగంచుకోవటం.

ఖర్చు: స్థానిక వనరులపై ఆధారపడటం వలన ఖర్చు తక్కువ, నష్టం కలుగచేసే స్థాయిలోనే నివారణ చర్యలు, మార్కెట్‌ ఆటు పోట్లను కొంతవరకూ తట్టుకోగలగటం.

ఈ రకమైన మార్పు నిజమైన ఆధునికత అవుతుంది.  రైతులు తమపై తాము నమ్మకం పెంచుకొని చేసే వ్యవసాయంతో లాభసాటి కావటమే కాక, పర్యావరణానికి కలిగే నష్టాలను తగ్గిస్తుంది.

బాక్స్ ఐటమ్స్

౧. సుస్థిర వ్యవసాయానికి కావలిసిన వనరులున్నాయా?

సుస్తిర వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా ఎదురయ్యే పెద్ద ప్రశ్నలు కేవలం ..పెడ వాడి పంటలు పండిచ్చ కలుగుతమా? దేశ అవసరాలు తీరుస్తాయా? అసలు కావలసినంత పెడ వుందా?

ఒక సారి మన దేశం లో వాడ బడుతున్న రసాయనిక ఎరువుల సంగతి చూద్దాం…గత సంవత్సరంలో లో వినియోగం సుమారు 250 లక్షల టన్నులు .  వీటిల్లో నత్రజని, భాస్వరము, పొటాష్ (NPK) లు తీసుకుంటే 170 లక్షల టన్నులు. వీటి వాడక సామర్ధ్యం 50 % కంటే తక్కువ. అంటే దీంట్లో కేవలం 90 లక్షల టన్నుల  కంటే తక్కువే మొక్కలకి ఉపయోగ పడతాయి.. మిగిలింది అంతా భూగర్భ జలాలను, భూములను నాశనం చేస్తాయి.  దీనికి తోడూ మనం అడగాల్సిన ఇంకో ప్రశ్న –పెట్రోల్ ఉత్పత్తుల మీదా, భూగర్భ ఖనిజాల పైనా ఆధార పడిన ఈ రసాయనిక ఎరువులు మనకి ఇంకా ఎంత కలం అందుబాటు లో వుంటాయి?  ఇప్పుడు వాడుతున్నట్టు గానే వాడితే పెట్రోలియం నిలువలు ఇంకో యాభై అరవై సంవత్సరాలలో, పోటాష్ నిలువలు ఇంకో ముప్పై నలభై  సంవత్సరాలలో అయిపోతాయి..ఆ తర్వాత అయినా మనం మారాల్సిందే!

సేంద్రీయ పద్ధతులలో పేడని కేవలం నత్రజని, భాస్వరము, పొటాష్ అందించే రసాయన పదార్ధం గా చూడకుండా, గాలినుంచీ నత్రజని మొదలైన వాయువులను నైట్రేట్ల రూపం లో స్థిరీకరించే సూక్ష్మ జీవులను అందించే వనరుగా చూస్తాం.  ఈ సూక్ష్మ జీవులు పశువుల కడుపులో వుంటూ అవి తినే ఆకులూ, కొమ్మలను జీర్ణం చేసుకోవటం లో సహాయం చేస్తాయి.  వీటిని వాడినప్పుడు భూమిలో కూడా అటువంటి పనే చేస్తాయి..దానికి తోడు భూమిలో వుంది అందుబాటులో లేని భాస్వరం లాంటి పోషకాలను అందుబాటులోకి తెస్తాయి.  అయినా కేవలం  నత్రజని, భాస్వరము, పొటాష్ ల గురించి ఆలోచించినా, దేశం లో పంట మిగులు, పశువుల పెడ రూపం లో చాలా నే దొరుకుతాయి.

 

వనరులు పరిమాణం (సంవత్సరానికి) NPK రూపం లో
రసాయనక ఎరువులు 240 లక్షల టన్నులు 170 లక్షల టన్నులు
పంట మిగులు 3000 లక్షల టన్నులు 62.0 లక్షల టన్నులు
పశువుల పెడ 3200 లక్షల టన్నులు 112.0 లక్షల టన్నులు
పట్టణాల వ్యర్దం 5161 (గ్రామాలూ/పట్టణాలు) nనుంచి 400 లక్షల టన్నులు. ఇందులో 40 శాతం సేంద్రీయ పదార్థం వుంటుంది 6.0  లక్షల టన్నులు

అయితే ఇవి సేకరించటం లో సమస్యలు-ఖర్చులు-శ్రమ వున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం రసాయనిక ఎరువుల మీద పెడుతున్న 60 వేల కోట్ల సబ్సిడి లో (2009 లో అది 120 వేల కోట్లు వున్నది. అప్పటినుంచి భారాన్ని రైతుల మీదకు మార్చారు) లో కొంత భాగాన్ని రైతులకి నేరుగా సుబ్సిడిల రూపం లో అందించ వచ్చు.

౨. దేశి ఆవు లేక పోతే సేంద్రియ వ్యవసాయం చేయలేమా?

మనం తరచూ వినే మాట దేశి ఆవు పేడ మాత్రమే వాడాలని చెప్తూ వుంటారు దానితో మిగితా జీవాలు వున్నా ఉపయోగ పడవేమో అని చాల మంది రైతులు సేంద్రియ వ్యవసాయానికి మారటానికి బయపడుతున్నారు. నిజానికి ఆవు అయినా, గేదె అయినా..గడ్డి, పచ్చి రొట్ట ల మీద ఎక్కువగా ఆధార పడినవైతే వాటి పేడని రైతులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కాకపోతే కష్టమైన వాతావరణం లో కూడా దేశి ఆవు తట్టుకుంటుంది కాబట్టి కొత్తగా పశువులు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు దేశి అవును కొనుక్కుంటే మంచిది.

౩. సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరమా?

ఈ మధ్య కొంత మంది సహజ వ్యవసాయ ఉద్యమం లో వున్నా వాళ్ళు ..ముక్యం గా సుబాష్ పాలేకర్ గారి శిష్యులు సేంద్రియ వ్యవసాయం రసాయనిక వ్యవసాయం కంటే ప్రమాదకరం అని ప్రచారం చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు. వారి భయాలకు, అపోహలకు రెండు ప్రధాన కారణాలు వారు చెప్పేది…సేంద్రియ వ్యవసాయం పేరుతో కంపెనీ లు తమ జీవ ఉత్పత్తులను అమ్ముకున్తున్నాయి అని. ఇది కొంత వరకు నిజమే కాని దేశం లో తొంబై తొమ్మిది శాతం సేంద్రియ రైతులు తమ సొంత ఉత్పదకాలే చేసుకుంటున్నారు.  రెండవది..వెర్మి కంపోస్ట్ (వాన పాముల ఎరువు) భూమి లో భార లోహాలు పెంచుతుంది, అసలు వీటి కోసం వాడే విదేశీ వానపాములు అత్యంత ప్రమాదకరం అని. ఇది కూడా పూర్తిగా అపోహే…వానపాములలో భూమి పైన పాకేవి, భూమి లోపలికి తోలుచుకొని వెళ్ళేవి రెండు రకాలవి వుంటాయి. భూమి లోకి తొలుచుకు వెళ్ళే వాటిని వాడితే కంపోస్ట్ గుంత లోనుంచి భూమి లోకి వెళ్లి పోతాయి కాబట్టి పైన పాకే వాటిని వాడతారు. మన దేశం లో సుమారు మూడు వందల రకాల వాన పాములు వున్నాయి…అందులో కొన్ని పైన పాకేవి ఇంకొన్ని భూమి లోకి తొలుచుకు వెళ్ళేవి. ఈ వానపాములు భార లోహాలు పెంచుతాయి అన్నది కూడా పెద్ద అపోహే. పంట వ్యర్ధలలోని భార లోహాలే కంపోస్ట్ లోకి వస్తాయి కాని వానపాములు కొత్తగా తాయారు చేయవు. పంట వ్యర్ధాలు కంపోస్ట్ గా మరే క్రమం లో మొత్తం పరిమాణం బాగా తగ్గుతుంది కాబట్టి భార లోహాల మోతాదు కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది అంటే. కంపోస్ట్ చేయకుండా ముల్చింగ్ చేసినా లేక భూమిలో కలిపినా ఇదే జరుగుతుంది.

 

తొలకరి, జనవరి 2015

 

  • Jun 17 / 2014
  • 0
తెలుగు

వార్తా వ్యాపారులు

భావ వ్యక్తీకరణకు 
బూతులు తిట్టటానికి
వినోదానికి
అవమాన పరచటానికి
తేడా తెలియని వాళ్ళు
విలేఖరులు ఎట్లా అవుతారు?
వార్తా వ్యాపారులే గాని…

  • Jun 13 / 2014
  • 0
తెలుగు

నువ్వు నేను

నువ్వు నేను
సమాంత రేఖలం
రైలు పట్టాలం
నిజమే ఎప్పటికి కలవం…
కాని…ఎప్పటికి విడిపోం!

(కాలేజి కవితలు)

  • Oct 13 / 2012
  • 0
Interviews, తెలుగు

ప్రజలకు నిర్ణయాధికారం కావాలి

(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ )

ఆంధ్రజ్యోతి: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వల్ల ఏమైనా ప్రయోజనముందంటారా?

జీవీ రామాంజనేయులు: అభివృద్ధి చెందిన దేశాల్లో జీవ వైవిధ్యం పెద్దగా కనిపించదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటుండటంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడే ఉద్దేశ్యంతోనే దాదాపు 193 దేశాలు కలిసి జీవ వైవిధ్య సదస్సును నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న సీఓపీ-11లో కార్టెజెనా బయోసేఫ్టీ ప్రొటోకాల్ గురించి చర్చ జరిగింది. జన్యు మార్పిడి పంటల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను గురించి చర్చించిన సదస్సు సామాజిక, ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని అభిప్రాయపడింది. ఈ పంటల వల్ల జీవ భద్రతకు నష్టం వాటిల్లుతుందని ఒప్పుకుంటే దానికి ఎవరు జవాబుదారీతనం వహించాలనేది ప్రశ్న. ఒకవేళ విత్తనాలను ఎగుమతి చేస్తే అక్కడ నష్టానికి ఎవరిని బాధ్యులను చేయాలనే సమస్య. ప్రస్తుతం బయో డైవర్సిటీ ఆతిథ్య దేశమైన భారతదేశం వచ్చే రెండేళ్లు అధ్యక్ష పదవిలో ఉండనుంది. అంటే ఇక్కడ జరిగిన నిర్ణయాల అమలు పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బయో డైవర్సిటీ సదస్సు మూలంగా పెద్దగా ప్రయోజనాలేవీ ఉండే అవకాశం లేదు.

ఆంధ్రజ్యోతి: గతంలో జరిగిన నిర్ణయాలేవైనా అమలు జరిగాయా?

జీవీ: 2010 సీఓపీ జపాన్‌లో జరిగింది. అక్కడ జరిగిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడిప్పుడే ఆచరణలోకి వస్తున్నాయి. జన్యుమార్పిడి పంటల విషయంలో ఆర్థిక విషయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలనేది గతంలో జరిగిన నిర్ణయమే. వాటిని ప్రస్తుతం సీరియస్‌గా అందరూ అంగీకరిస్తున్నారు. ఎక్సెస్ బెనిఫిట్ షేర్ గురించి చర్చ జరిగింది. వాణిజ్యం కోసం జీవ వైవిధ్యాన్ని వాడుకుంటే అప్పటి వరకు వాటిని కాపాడిన వారికి ఎలాంటి ప్రతిఫలం అందించాలనే అంశంపై కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది.

ఆంధ్రజ్యోతి: సీఓపీలో జరిగే నిర్ణయాలు అమలు చేయడంలో స్థానిక చట్టాలు అంగీకరించకపోతే?

జీవీ: ఎక్కడ ఏ నిర్ణయం జరిగినా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. ప్రజలకు నిర్ణయాధికారం కావాలి. గ్రామస్థాయిలో బయో డైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీలు ఉండాలి. అవేవీ లేకుండా, ఎవరితో చర్చించకుండా,ప్రజల భాగస్వామ్యం లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం జీవ వైవిధ్య సదస్సు అలాగే నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఒప్పందాలైనా ప్రజలదే నిర్ణయాధికారం కావాలి. కేంద్రం, శాస్త్రవేత్తలది కాదు. దేశంలో బీటీ వంగ విషయంలో మాత్రమే ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించింది. ఇక అన్ని విషయాల్లో ప్రజల అభిప్రాయాలతో సంబంధంలేకుండానే నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జన్యుమార్పిడిపై జరుగుతున్న ఫీల్డ్ ట్రాయిల్స్ ఇందుకు ఉదాహరణ. అందుకే ఈ సదస్సును వ్యతిరేకిస్తూ ‘పీపుల్స్ బయో డైవర్సిటీ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నాం.

ఆంధ్రజ్యోతి: జీవ వైవిధ్య నష్టానికి కారణాలేంటి?

జీవీ: జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడమంటే సమస్యకు మూలాల్ని వెతకడం. బయో డైవర్సిటీ సదస్సు సందర్భంగా పిచ్చుకలు, రాబందులు అంతరించిపోతున్నాయంటూ భారీ హోర్డింగులు పెట్టారు. కారణమేంటో చెప్పలేదు. అందుకు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలే కారణం. జన్యు మార్పిడి విత్తనాలు, క్రిమి సంహారక మందులు, సెల్‌ఫోన్ టవర్లు పక్షుల మనగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. వైవిధ్యాన్ని రక్షించే పంటల్ని ప్రోత్సహించాల్సింది పోయి… అనువుగానివి వేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అడవుల్ని విధ్వంసం చేసి మైనింగ్‌లకు అనుమతిస్తున్నారు. సోంపేట లాంటి ప్రాంతాల్లో బీల భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే… పవర్ ప్లాంట్‌ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టుల మూలంగా జీవ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది.

ఆంధ్రజ్యోతి: జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఏం చేయాలి?

జీవి: జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టాలి. వైవిధ్య పంటల్ని ప్రోత్సహించాలి. రైతులకు ఆర్థిక భద్రత కల్పించాలి. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులను నిలిపివేయాలి. పర్యావరణాన్ని కాపాడే పరిశోధనలను ప్రోత్సహించాలి. అప్పుడే జీవవైవిధ్యాన్ని గుర్తించినవాళ్లమవుతాం. ప్రజలు సైతం జీవవైవిధ్యాన్ని కాపాడడం తమ బాధ్యతగా స్వీకరించాలి.

  • Oct 03 / 2012
  • 0
Articles, తెలుగు

జీవ వైవిధ్యం తో నే ఆహార భద్రత

జి. వి. రామాంజనేయులు, వీణ రావు

మానవ మనుగడ అంతా కూడా ప్రకృతి లోని జీవరాసులని సమర్ధవంతంగా, సుస్థిరంగా వాడుకోవటం పై ఆధార పడి వుంటుంది.   అయితే ఎక్కువ భాగం ఈ జీవ వైవిధ్యం అంతా పేద, అభివృద్ధి చెందిన దేశాలలో వుంది.  ప్రకృతి వనరులని విచ్చల విడిగా వాడు కొని పారిశ్రామికంగా, వ్యాపారాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ భవిష్య వాణిజ్య ప్రయోజనాలకు ఈ జీవ వైవిధ్యం పైన కన్ను వేశాయి.  తమ దగ్గర లేని ఈ జీవ వైవిధ్యాన్ని వాడుకోవటానికి అవకాశం, వాడుకోవటం లో వీటి పై మేధో సంబంధ హక్కులు సంపాదించుకోవటానికి పెద్ద దేశాలు ప్రయత్నించటం తో ఇరవై సంవత్సరాల క్రితం –ఈ పరస్పర వ్యతిరేక ఆలోచనలను, ఒక తాటి పైకి తెచ్చి సుస్థిర అభివృద్ధి సాధించటానికి ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యం లో  ‘జీవ వైవిధ్య సదస్సు’ ప్రారంభమైంది.

భారత దేశం లో జీవ వైవిధ్యం

ప్రపంచం లో ఇప్పుడు సాగులోవున్న పంటలన్నీ పుట్టినవి  (centre of origin) ఎనిమిది ప్రాంతాలలో అని శాస్త్రవేత్తలు చెపుతారు, అందులో భరత దేశం ఒకటి.  మన దేశం లో సుమారు 375 పంటలలో, 140 కి పైగా పశువులలో  (domesticated)    వివిధ్యం వుంది.  ప్రపంచ భూవిస్తీర్ణం లో భారత్  కేవలం 2.4%  మాత్రమే, అయినా జనాభా 18%.  ఇంతటి జనాభా వున్నా, మానవాళికి తెలిసిన 45,000 రకాల మొక్కలు, 91,000 రకాల పశువులు మన దేశం లో వున్నాయి. అయితే, ఇంతటి వైవిధ్యానికి పుట్టునిల్లు అయిన దేశం లో  మనం ఈ జీవ వివిధ్యాన్ని త్వరిత గతిన కోల్పోతున్నాం.  అందుకు ఈ జనాభా పెరుగుదల, అభివృద్ధి అవసరాలు కారణం అని ప్రభుత్వం చెపుతున్నా, విశ్లేషణలు అన్ని కూడా ప్రభుత్వం ఎంచుకున్న టప్పుడు విధానాలే కారణం అని తెలియ చేస్తున్నాయి.  ఆధునిక వ్యవసాయం పేరుతో జరిగిన/జరుగుతున్నా విధ్వంసం కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణాలు కావొచ్చు, గనుల తవ్వకాలకు కావచ్చు లేక పారిశ్రామికీకరణ పేరుతోనో, పట్టణీకరణ పేరుతోనో కావొచ్చు ప్రభుత్వ ఆధ్వర్యం లోనే ఈ విద్వంశం కోనసాకు తూనే వుంది.  ఇలాంటి విధ్వంసకర మైన అభివృద్ధి వ్యతిరేకం గా చాల ప్రాంతాలలో ప్రజలు తిరగ బడుబడుతూనే వున్నారు.  స్థానిక జీవ వైవిధ్యం పైనే ఆధార పడిన తమ జీవనో పాదులకు ఇలాంటి అభివృద్ధి ముప్పు అని గుర్తింఛి  పోరాటం చేస్తున్నారు.

 use centres fo origin photo

(1)    Mexico-Guatemala, (2) Peru-Ecuador-Bolivia, (2A) Southern Chile, (2B) Southern Brazil, (3) Mediterranean, (4) Middle East, (5) Ethiopia, (6) Central Asia, (7) Indo-Burma, (7A) Siam-Malaya-Java, (8) China

 వ్యవసాయ రంగం జీవ వైవిధ్యం

జీవ వైవిధ్యాన్ని ఆహార, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వ్యవసాయ రంగం లోనే ఎక్కువ వాడుకుంటాం.  జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లటం తో వ్యవసాయ రంగానికి పెద్ద ముప్పు, తద్వారా మన ఆహార భద్రత కు పెనుముప్పు ఏర్పడే అవకాసం వుంది. 

 మన దేశ వ్యవసాయం లో ఒకప్పటి జీవి వైవిధ్యం

 

పంట/జాతి రకాల సంఖ్య
 వరి 100,000 Varieties  
 మామిడి 1000 Varieties  
 జొన్న 5000 Varieties
వంగ 3500 varieties  
 ఆవులు 27 Breeds  
 మేకలు 22 Varieties  
 గొర్రెలు 40 Breeds  
 కోళ్ళు 18 Breeds  
 గేదెలు 8 Breeds  

  

 

ప్రపంచంలో సహజం గా వుండే మొక్కలో కొన్ని మొక్కలను తన అవసరాలకు వాడుకోవచ్చొని మానవుడు గుర్తించటం తో వ్యవసాయం, తద్వారా స్థిర జీవనం, గ్రామాల అభివృద్ధి ప్రారంభం అయ్యాయి.  మన దేశం లో వున్న వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు, వివిధ అవసరాల కోసం అనువైన వంగాడాలు, వ్యవసాయ పద్ధతులు కలక్రమేని అభివృద్ధి చెందాయి.    మన అవసరాలకు వాడుకుంటున్న పంటలన్నిటిని మూడు వేల సంవత్సరాల క్రితమే సాగులో తెచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కొత్త పంటని కూడా మనవ జాతి కనుక్కోలేక పోయింది. 

 

అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మనం ఎంచుకున్న విధానాలు ఈ వైవిధ్యాన్ని నాసనం చేస్తున్నాయి.  మనకు స్వాతంత్ర్యం వచ్చేసరికి మన ఆహార అవసరాలకు అనేక పంటలు వున్నా, కేవలం కొన్ని పంటల పై ద్రుష్టి పెట్టటం వాళ్ళ మిగిలినవి కనుమరుగై పోయాయి.  ఆహార ధాన్యాలు అంటే ఈ రోజు మనకు తెలిసినది కేవలం వరి, గోధుమ మాత్రమే, వీటి కంటే ఆరోగ్య కరమైన అనేక ఇతర చిరుధాన్యాలు ఈ రోజు సాగులో లేవు.  వరి, గోధుమ సాగు పెరగటం వలన నీటి వినియోగం పెటిగింది.  ఒక కిలో వరి బియ్యం పండటానికి  దాదాపు 5000 లీటర్ల నీరు అవసరం, అదే జొన్న, సజ్జ లాంటి చిరుధాన్యాల కైతే కేవలం 200 లీటర్ల నీరు సరిపోతుంది.  ఇలా పంటల సరళి లో మార్పు రావటం వలన నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు తరగి పోయాయి.  అలాగే పెద్ద విస్తీర్ణం లో ఒకే పంట వేయటం వలన పురుగులు తెగుళ్ళ సమస్యలు, ఒకే పంటను మరల మరలా అదే భూమి లో సగుచేయటం వలన భూసారం కోల్పోవటం జరిగుతూంది. దీని వలన పురుగు మందుల వినియోగం, రసాయనిక ఎరువుల వినియోగం పెరుగుతోంది. అలాగే మన రాష్ట్రము లోని ఒంగోలు జాతి ఆవులు కాని, పుంగనూరు ఆవులు కాని, దక్కని గొర్రెలు కాని, అసిల్ కోళ్ళు కాని అన్ని మన ప్రాంతాలకి అనువైనవి. వాటిని ప్రోత్సహించకుండా, కేవలం బయట దేశాల నుంచి తెచ్చిన వాటినే ప్రోత్సహించటం జరుగుతోంది.  

ఎక్కడ తప్పు చేసాం?

చారిత్రకంగా చూస్తే, చాలా రకాల పంటలు మన దేశం లోనే వుద్భావించటం తో పాటు, స్థానిక వనరుల ఆధారంగా, వివిధ అవసరాలకోసం సాగు పద్ధతులు , పంట రకాలు వున్నట్టు తెలుస్తోంది. అయితే ఆధునిక వ్యవసాయం పేరుతో మన అమెరికా దేశ వ్యవసాయన్ని అనుకరించే ప్రయత్నం చేయటం తో కస్టాలు మొదలయ్యాయి.

వరి మనకి ముక్య మైన ఆహార పంట 1700 ల ప్రాంతాలలోనే తమిళ నాడు లోని చెంగల్పట్టు జిల్లాలో వరి దిగుబడులు హెక్టారు కి 9 టన్నులు వున్నట్టు తెలుస్తుంది. అయితే మెత్త ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో సాగు పద్ధతులు, రకాలు వేరుగా వుండేవి వాటికి అనుగుణం గానే దిగుబడులు వుండేవి.  స్వతంత్రం నాటికి మన 50,000 రకాల వరి సాగు లో వుండేవి.అందులో సుమారు 55%  మెత్త వరి రకాలు. హరిత విప్లవం పేరుతో మనం వీటి నన్నిటిని నాసనం చేసి నీటి ముంపుతోటే పండించే కొన్ని అధిక దిగుబడి రకాలను ప్రోత్సహించాం.  దీని వలన ఈ వైవిధ్యం అంతా కోల్పోయి ఈ రోజు మన దేశం లో దాదాపు 85% వరి కేవలం 10 రకాల నుంచి మాత్రమే వస్తుంది అంటే ఆక్చర్య పడాల్సిందే.  వరదలను తట్టుకునే రకాలు, కరువుని తట్టుకునే రకాలు, ఉప్పు నీటి ని తట్టుకునే రకాలు అనేకం వుండేవి. అలాగే ఎక్కువ విటమినులు, పోషకాలు వున్న రకాలు కూడా సాగులో వుండేవి. అయితే ఇప్పుడు అవే లక్షణాలను జన్యు మార్పిడి ద్వార ప్రవేశ పెట్ట టానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

సూక్ష్మ పోషకాలు ఎక్కువగా వుండే వరి రకాలు

 

రకాలు ఇనుము (Fe) (mg/kg) జింకు (Zn) (mg/kg)
స్థానిక రకాలు
కేలాస్ 13.8 35.5
నోయిచి 8.0 46.0
పరమై-సాల్ 15.0 42.5
కబిరాజ్-సాల్ 9.5 36.8
కలాభాత్ 39.3 26.8
అభివృద్ధి చేసిన రకాలు
IET 7029 1.9 31.4
MS13 7.0 34

అలాగే మనకి పోషకాలు కావాలంటే ఆహారం లో వైవిధ్యం వుండాలి కాని ఒక్క వారిలోనే అన్ని పోషకాలు వుండేలా చేయాలి అనుకోవటం మూర్ఖత్వం.  ప్రభుత్వ పరిశోదనలు, సబ్సిడీలు, మద్దతు ధరలు అన్ని వారికీ మాత్రమే సహకారం అందిస్తూ వుండటం తో  తృణ ధాన్యాల సాగు క్రమేపి తగ్గుతూ ఇప్పుడు పూర్తిగా కనుమరుగవుతోంది.  పోషకాల పరం గా చూస్తే వీటి వరి ఈ మాత్రం సాటి రాదు. పైగా నీటి వినియోగం కూడా తక్కువ.

 

తృణ ధాన్యాలు ఐరన్ Fe content (mg/100 g)
సజ్జ 16.9
సామలు 15.2
కొర్ర 9.3
రాగి 2.8
MS13 వరి రకం 3.0

పోషకాలు ఎక్కువుందే పంటలను ప్రోత్సహించ కుండా ఇప్పుడు ‘గోల్డెన్ వరి’ పేరుతో జన్యు మార్పిడి వరి తేవటానికి  ప్రయత్నం జరుగుతోంది.  వరి లో విటమిన్ బి తయారికి అవసరమైన బీటా కేరాటిన్ వుత్పత్తి అయ్యేలా, అలాగే ఎక్కువ ఐరన్ వుండేలా  జన్యుమార్పిడి పంటలు తయారు చేస్తున్నారు.

బీటా కేరాటిన్ ఎక్కువగా వుండే ఆహారం

 

పంటలు తినటానికి అనువైన భాగం Β-Carotene (µg/100 g)
ఆవాలు ఆకులు/పూలు 16000
తోటకూర ఆకులు 10900
మునగ ఆకు 7500
గోల్డెన్ వరి గింజలు 160

కొన్ని పంటలను, వాటిల్లో కేవలం కొన్ని రకాలు, కొన్ని రకాల  పండించే పద్దతులను మాత్రమే ప్రోత్సహించటం తోనే సమస్యలు అని గుర్తుంచాలి.

అలాగే యంత్రికీకరణ కు అనుగుణంగా పంట రకాలు, వ్యసాయ పద్ధతులు మార్చుకోవటం ఇంకో పెద్ద సమస్య.  దీనికి పత్తి ని వుదాహరణ గా చెప్పుకోవచ్చు.  ప్రపంచం అంతా ఆకులూ, చర్మాలు కట్టుకునే రోజుల్లో, మన దేశం లో పత్తి సాగులో వుండేది.  ప్రపంచ దేశాలన్నితిలోను మొహంజదారో నాటి నుంచి మన దేశం బట్టలకు ప్రసిద్ది. అయితే పారిశ్రామిక విప్లవం తర్వాత వచ్చిన స్పిన్నింగ్ మిల్లులకు, బ్రిటిష్ రాజ్యం లో అక్కడి మాంచెస్టర్ కు పత్తి ఎగుమతి చేయటం కోసం అమెరికన్ పొడుగు పింజ పత్తి ప్రవేశ పెట్టటం జరిగింది.  దేశీయ పత్తి మెత్త ప్రాంతాలలో పండేది, పురుగు-తెగుళ్ళ సమస్య తక్కువ అయితే, ఈ అమెరికన్ పత్తులు ఎక్కువ నీటి వినియోగం చేసేవి, పైగా పురుగుల-తెగుళ్ళ సమస్యలు ఎక్కువ.  ఈ అమెరికన్ పత్తులతో ఈ రోజు వ్యవసాయ రంగం లో పెద్ద ఎత్తున నాసనం చేస్తున్న ‘పచ్చపురుగు’ (దీనిని అమెరికన బొల్ వార్మ్ అనే అంటారు) వచ్చింది.  వాటిని నియంత్రించటానికి రసాయనిక పురుగు మందులు, వాటికి తట్టుకునే శక్తి పెంచుకుంటే ఇంకా విషపూరిత మైన పురుగు మందులు, ఇప్పుడు జన్యు మార్పిడి పత్తి ఇలా సమస్య కి టప్పుడు పరిష్కారాలు వెతుకుంటూనే వున్నాం.  నిజానికి దేశీయ పత్త్తి రకాలని అభివృద్ధి చేసి, దానికి అనుకూలంగా స్పిన్నింగ్ యూనిట్లు తాయారు చేసి వుంటే, సమస్య చాలా మాటకు తక్కువ వుండేది.

అలాగే పురుగు మందుల వాడకం పెంచుకుంటూ పోవటం, జన్యు మార్పిడి పంటలను అభివ్రిద్ది చేయటం లాంటివి కాకుండా స్థానిక వనరుల తో చేసే సుస్తిర వయస్య పద్ధతులను ప్రోత్సహిస్తే ఖర్చులు తగ్గటం తో పాటు జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుకున్న వరం అవుతాము.

వ్యవసాయ వైవిధ్యం –ప్రాంతీయ భేదాలు

చాలా సార్లు మనం గుర్తించని ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే, కొన్ని పంటల్ని కొని రకాల పద్దతులని ప్రోత్సహించటం వలన అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతోంది. ఉదాహరణకి తీసుకుంటే వరి, గోధుమ లకు మాత్రమే ప్రభుత్వ ప్రోత్సాహకాలు వుండటం వలన అవి పండించే ప్రాంతాలలోనే అభివృద్ధి జరిగింది.  మెట్ట పంటలు పండే ప్రాంతలో కూడా రైతులు వాటిని మానేసి వరి, పత్తి  లాంటి పంటలకి మల్లటం వలన ఎక్కువ గా బోరు భావులు వేసుకోవటం, భూగర్భ  జలాలు అడుగంటి పోవటం అప్పుల పాలు కావటం చూస్తున్నాం.  దీని వలన దేశం లో దాదాపు 60%  వున్న మెట్ట ప్రాంతాలు అన్ని కూడా పేదరికం తో మగ్గుతున్నాయి. అప్పులు ఎక్కువ కావటం తో ఆత్మ హత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.  ఈ పరిణామం మన మన రాష్ట్రము లోని తెలంగాణా ప్రాంతం లోను, రాయల సీమ ప్రాంతం లోను , మహారాష్ట్ర లోని విదర్భ ప్రాంతం లోను, కర్ణాటక లో బీదర్ ప్రాంతం లోను, రాజస్తాన్ లోను, మధ్య ప్రదేశ్ లోను చూడొచ్చు. 

జీవ భద్రతే ముక్యం

జీవ వైవిధ్య సదస్సు లో జన్యు మార్పిడి పంటలతో ‘జీవ భద్రతకు’ ముప్పు వుంది కాబట్టి సభ్య దేశాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్నది  ప్రధాన చర్చనీయాంశం గా మొదటి ఇదు రోజులలో వచ్చింది. బిటి పత్తి తో మన దేశ అనుభవాలు కాని, జన్యు మార్పిడి  మొక్క జొన్న తో విదేశీ అనుభవాలు కాని అన్ని చర్చించిన తర్వాత జన్యు మార్పిడి పంటల పై నిర్ణయాలు కేవలం సాంకేతిక అంశాల ఆధారం గా మాత్రమే కాకుండా… సామజిక, ఆర్ధిక అంశాలు కూడా ద్రుష్టి లో పెట్టుకోవాలని, అలాగే జీవ భద్రత కు ముప్పు వాటిల్లితే వీటిని అబివృద్ది చేసిన వాళ్ళకి జవాబుదారితనం వుండాలని, భాధితులకి (ప్రాంతాలు, దేశాలు) నష్ట పరిహారం చెల్లించే వ్యవస్థ వుండాలని ఒప్పందంలో వున్నది కాబట్టి దీని ఆధారం గా మన ప్రభుత్వ్యం జీవ భద్రత చట్టం తేవాలి. ఇప్పుడున్న BRAI బిల్లును రద్దు చేయాలి.

అలాగే, ఈ సదస్సు రెండవ భాగం అంతా జీవ వైవిధ్యాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకుంటే (access)..అప్పటిదాకా వాటిని కాపాడుతున్న వాళ్ళకి లాభాలు ఎలా పంచాలి (benefit sharing) అన్న వాటిపై కూడా చర్చ జరగ బోతుంది.  ఈ నేపధ్యం జీవ వైవిధ్య కమిటీ లను బలోపేతం చేయాల్సిన అవసరం వుంది. లేకుంటే చివరకి జీవ వైవిధ్యాన్ని కంపెనీ లకు ఉపయోగ పడతాయి కాని ప్రజలకు ఏమాత్రం ఉపయోగ పడవు.

ఆహార భద్రత కు ఇలాంటి పద్ధతులే మార్గమా?

ఆధునిక వ్యవసాయం తో వచ్చే సమస్య ల గురించి మాట్లాడినప్పుడల్లా ఆహార భద్రతకు ఇదే దారి అని వాదన లు వినిపిస్తున్నాయి. ఈ రోజు దేశం లో చూస్తే సుమారు 25 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. మన దేశ జనాభా 130 కోట్లు, అందరూ మూడు పూటలా భోజనం చేస్తారు  అనుకున్నా  మనకు కావలిసింది 9.5 కోట్ల తన్నులు మాత్రమే (ప్రతి వ్యక్తికీ రోజుకు 200 గ్రా. లెక్క తీసుకుంటే). అంటే ఇప్పుడు వస్తున్నా వుత్పత్తి మన అవసరాలకంటే రెండింతలు వుంది.  అయినా దేశం లో ఆకలి, పేదరికం వున్నాయి. ప్రజలకి,  ముక్యం గా వ్యవాసం మీద ఆధార పడి జీవిస్తున్న గ్రామీణ ప్రజలకి ఆదాయ భద్రత కల్పిచాకుండా ఆహార భద్రత అసంభవం.  అలాగే ఆహార భద్రత అంటే కేవలం వరి గోధుమ కాదు, తిండి గింజలు మాత్రమే కాదు.  పోషక ఆహార భద్రత కావలి, పర్యావరణ భద్రత కావాలి అప్పుడే దేశానికి ఆహార భద్రత…అది కొత్త టే టెక్నాలజీ లలో లేదు…. వైవిధ్యాన్ని , పర్యావరణాన్ని, చిన్న సన్నకారు రైతుల, రైతు కూలీల జీవనోపాదులు కాపాడుకోవం లో నుండి….ప్రకృతి వనరులను కాపాడుకోవటం లో వుంది.

 

Pages:12